వినుకొండకు వస్తున్న APSRTC బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి నాయుడుపేట పరిధిలోని విన్నమాల వద్ద ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం, తిరుపతి నుంచి వినుకొండకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో, అప్రమత్తమైన ప్రయాణికులు అందరూ దిగిపోయారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







