ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. గురువారం పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో నిర్వహించిన “స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని – ఆరోగ్యకరమైన సమాజం దిశగా” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన సందర్శించి, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మందులు, ఆరోగ్య పరీక్షల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావుతో పాటు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.








