ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన గంగాదేవి నరసింహారావు కుటుంబ వివాదాల కారణంగా ఈనెల ఐదో తారీకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన కోసం కుటుంబ సభ్యులు మరియు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, తాజాగా ఆయన క్షేమంగా కనిపించినట్లు సమాచారం.ఆయన సురక్షితంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై సమాచారం అందించిన ప్రజలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.







