వినుకొండ పట్టణంలోని ఐనవోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా నేలకొరిగింది. పూర్తిగా ఎండిపోయిన చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయింది. సాధారణంగా ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చెట్టు కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.






