
వినుకొండలో రషీద్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు నిందితుల బెయిల్‌ను రద్దు చేసింది.
గత ఏడాది జులై 17న వినుకొండలోని మార్కాపురం రోడ్డుపై రాత్రి సమయంలో యువకుడు రషీద్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు 1 మినహా మిగిలిన వారికి కోర్టు ముందుగా బెయిల్ మంజూరు చేసింది.
అయితే, బెయిల్‌పై బయట ఉన్న నిందితుల్లో నలుగురు సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వారి బెయిల్‌ను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
బెయిల్ రద్దైన నలుగురు నిందితులు వారం రోజుల్లో కోర్టులో హాజరుకావాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.






