గుంటూరు పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం బృందావన్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన “శివపార్వతుల కళ్యాణం” మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. వేదమంత్రోచ్ఛారణలు, సంప్రదాయ పూజా కార్యక్రమాలతో శివపార్వతుల కల్యాణాన్ని భక్తులు కన్నుల పండుగగా వీక్షించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, శాంతి పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.







