నూజెండ్లలో అక్రమంగా మద్యం విక్రయం.. ఒకరి అరెస్టు
నూజెండ్ల గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19న పెట్రోల్ బంక్ వద్ద పాపిరెడ్డి అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తుండగా దాడి చేసి, 180 ఎంఎల్ ఓసీ విస్కీ 6 సీసాలు, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ బీర్ 5 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 సీసాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
కామెంట్లు