వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో 177 నామినేషన్లు చెల్లుబాటు
వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకు కౌన్సిలర్ స్థానాల కోసం దాఖలైన 161 నామినేషన్లలో ఒకటి తిరస్కరణకు గురికాగా, 160 చెల్లుబాటయ్యాయి. చైర్మన్ పదవికి దాఖలైన 17 నామినేషన్లూ చెల్లుబాటయ్యాయి. కౌన్సిలర్ స్థానాల్లో టీడీపీ నుంచి 59 మంది, వైఎస్సార్సీపీ నుంచి 58 మంది, స్వతంత్రులుగా 22 మంది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.
కామెంట్లు