
వినుకొండ: ప్రముఖ సంఘ సేవకులు, అడ్వకేట్ మరియు వినుకొండ AGP ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు తన తండ్రి ముప్పాళ్ళ చెన్నయ్య 10వ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు.యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని నిరాశ్రయులు మరియు నిరుపేదలకు భారీ ఎత్తున దుప్పట్లు, భోజనాల పంపిణీ చేశారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పక్కన నివసించే వారికి నాణ్యమైన దుప్పట్లు అందజేసి, ఆకలితో ఉన్నవారికి స్వయంగా భోజనం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ రావు మాట్లాడుతూ, తన తండ్రి నేర్పిన సేవా దృక్పథమే తాను ఈ స్థాయికి రావడానికి కారణమని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఫౌండేషన్ సభ్యుల సహకారం కార్యక్రమ విజయానికి ఎంతో దోహదపడిందని అన్నారు.కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు పమిడిపల్లి అనిల్ రాజ్, ఉపాధ్యక్షులు గుమ్మడి మనోహర్, జాయింట్ సెక్రెటరీ పెనుమాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.






