

పల్నాడు జిల్లా వినుకొండ వ్యవసాయ మార్కెట్ వద్ద శనివారం (7 ఫిబ్రవరి 2026) ఉదయం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు దెబ్బతింటున్నాయని, రైతుల సమస్యలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులు, కార్మికులు ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ముట్లూరి బాలస్వామి, కాకర్ల పెద్దారావు, అశోక్, ఏడుకొండలు, సైదులు, లక్ష్మణరావు, వాసు, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య, నాగేశ్వరావు, మల్లికార్జున రావు, పిచ్చారు తదితరులు పాల్గొన్నారు.







