
రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకుని, 01 జనవరి 2026ను అర్హత తేదీగా నిర్ణయించి ఈ ఓటరు జాబితాలను తయారు చేయాలని అధికారులు సూచించారు.సిద్ధమైన ఓటరు జాబితాలను 09 మార్చి 2026న ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.







