
సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల సంక్షేమానికి మరియు దేశాభివృద్ధికి దిక్సూచిలా ఉందని పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ స్కూల్లో బడ్జెట్ విశ్లేషణ మరియు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య వక్తగా తాడువాయి రామకృష్ణ పాల్గొని బడ్జెట్లోని కీలక అంశాలను వివరించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని, అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కేటాయింపులు ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.








