
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో ఇంగ్లీష్ పరీక్ష తేదీ మారింది. రంజాన్ పండుగ మార్చి 20వ తేదీన ఉండటంతో, ఆ రోజు నిర్వహించాల్సిన ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21వ తేదీకి (శనివారం) మార్చినట్లు విద్యాశాఖ ప్రకటించింది.ఇంగ్లీష్ పరీక్ష మినహా మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు అన్నీ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి.పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది:
మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్,
మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్,
మార్చి 21 – ఇంగ్లీష్
(మారిన తేదీ)మార్చి 23 – గణితం
మార్చి 25 – ఫిజికల్ సైన్స్,
మార్చి 28 – బయోలాజికల్ సైన్స్
మార్చి 30 – సోషల్ స్టడీస్,
మార్చి 31 – ఓఎస్ఎస్సీ పేపర్–1
ఏప్రిల్ 01 – ఓఎస్ఎస్సీ పేపర్–2 / వృత్తి విద్యా కోర్సులువిద్యార్థులు తాజా షెడ్యూల్ను గమనించి పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.






