
నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో శనివారం తెలుగు, సంస్కృత పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఘంటా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చరిత్రలో లభ్యమవుతున్న మొట్టమొదటి తెలుగు పదము “నాగాబు” అని కనుగొన్నది ప్రభాకర శాస్త్రి అని తెలిపారు. అలాగే ప్రభాకర శాస్త్రి వంటి మహనీయులు ప్రపంచ సాహితీ చరిత్రకు ప్రకాశమువంటివారని అన్నారు.కార్యక్రమంలో భాగంగా ప్రభాకర శాస్త్రి జీవిత విశేషాలను టీవీ ద్వారా ప్రదర్శించి విద్యార్థులకు వివరించారు. ప్రభాకర శాస్త్రి రచించిన పద్యాలను విద్యార్థులు ఆలపించి ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కొండలరావు, ఖాజా మునీర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






