
వినుకొండ పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్–2026 లో భాగంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ నిర్వహించిన పోటీలలో వివాహ ఆచారాల కేటగిరీకి చెందిన “వెడ్డింగ్ మూమెంట్స్” ఫోటోకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డ్ అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్లు ఈ పోటీలలో పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్–2026 అవార్డ్ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ సీఆర్ సత్యనారాయణ, ఎస్ఏపీ చైర్మెన్ ఎం.సి. శేఖర్, ఎడిట్ పాయింట్ రమేష్, అభిమన్యు చేతుల మీదుగా సుబ్బారావు అవార్డ్ మరియు సర్టిఫికెట్ స్వీకరించారు.అవార్డ్ అందుకున్న కేసానపల్లి సుబ్బారావును పల్నాడు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్బీకే, వినుకొండ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సూర్య బ్రహ్మం, వెంకటేష్, పెద్ద మల్లయ్య, శ్రీకాంత్, సి.పి. కృపాకర్, వేణు, నరేంద్ర అభినందించారు.







