
వినుకొండ: పట్టణంలోని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, పురపాలక సంఘ చైర్మన్ షేక్ దస్తగిరి మరియు షకీలా దంపతులకు ఆదివారం ఘన సన్మానం జరిగింది. బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బి.వి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బి.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ, నామమాత్రపు ఫీజులతో పేదలకు సేవలందిస్తూ వెన్నెల నేత్రాలయం 26 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవలను అందిస్తున్న వారిని సత్కరించుకోవడం సమాజం బాధ్యత అని తెలిపారు.మున్సిపల్ చైర్మన్‌గా, వార్డు కౌన్సిలర్‌గా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న దస్తగిరి దంపతులు ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగ పద్మ, జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు మరియు పలువురు పాల్గొన్నారు.







