
వినుకొండ: వినుకొండ–వెల్లటూరు రోడ్డులో గల శ్రీకృష్ణ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఈరోజు వినుకొండ నియోజకవర్గ అఖిలభారత యాదవ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు బొంబోతుల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులందరూ ఐక్యంగా ఉండి, విద్యా మరియు రాజకీయ రంగాల్లో చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన యాదవులను చైతన్యం చేయడం తన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు సహా అన్ని కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో వినుకొండ నియోజకవర్గ అధ్యక్షునిగా ఓటేల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా చీరపు ఏడుకొండలు, ఉపాధ్యక్షులుగా పందిళ్ళ బాల వెంకటేశ్వర్లు తదితరులను యాదవుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ యువజన అధ్యక్షుడు ఆల అనంతరామయ్య యాదవ్, ఎస్ వెంకట్ యాదవ్, వినుకొండ నియోజకవర్గ నాయకులు, యార్డ్ చైర్మన్ తలారి ఆంజనేయులు, భత్తుల గోవిందయ్య, భత్తుల గోవిందరాజులు, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, బైలడుగు రామయ్య, మహిళా జన వీరయ్య, వెల్లటూరు సర్పంచ్ పెసల వెంకటనారాయణ, వినుకొండ నియోజకవర్గ టిడిపి అధ్యక్షులు కాటం కోటేశ్వరరావు, గోరంట్ల యోగయ్య, దొడ్డ కొండలు, ఏనుగుపాలెం ఎంపీటీసీ గుమ్మ కొండలు, దూళ్ల నాగరాజు, గోరంట్ల ఆంజనేయులు, కిష్టం కొండలు, చవాలా పాపారావు యాదవ్, బత్తుల శ్రీనివాస్ యాదవ్, తెల్లమేకల పోలురాజు, బత్తుల నాగబ్రహ్మం, బత్తుల సుబ్బారావు, జెట్టి శ్రీహరి, పొలం నరసింహారావు, రాజశేఖర్, కామసాని నాగేంద్రబాబు, పొలం శివప్రసాద్, గుమ్మా గోవింద్, గణేష్, పిన్నబోయిన రమణయ్య, బలరాం తదితరులు పాల్గొని ప్రసంగించారు.







