
వినుకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సోమవారం (09-02-2026) వినుకొండ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఉదయం 09:30 గంటలకు వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో రైతులకు పట్టదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.అనంతరం ఉదయం 11:00 గంటలకు వినుకొండ మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రైతు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భోజనశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ మేరకు చీఫ్ విప్ కార్యాలయం, వినుకొండ నుండి షెడ్యూల్ విడుదలైంది.






