
శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పొనుగుపాటి పెద్ద ఆంజనేయులు స్థానిక శావల్యాపురం పోలీస్ స్టేషన్కు సోమవారం కుర్చీల కొనుగోలు కోసం రూ.12,000 ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ వెంకటేష్ బాబుకు నగదు అందజేశారు. పోలీస్ స్టేషన్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందజేసినట్లు పెద్ద ఆంజనేయులు తెలిపారు.పోలీస్ సిబ్బంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.






