
సోమవారం వినుకొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రైతు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భోజనశాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులకు ఈ భోజనశాల ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.








