
హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండకు చెందిన చిత్రకారుడు డా. వజ్రగిరి జెస్టిస్ జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు.ది. 8-2-2026 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జేఎన్టీయూ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో క్రియేటివ్ హార్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో నిర్వహించిన “మాస్టర్ స్ట్రోక్స్” జాతీయ చిత్రకళా ప్రదర్శనలో జెస్టిస్ తాను చిత్రించిన “మహేంద్ర మాత మేదరి” చిత్రానికి గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు లభించింది.జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్ధమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. జెస్టిస్ రూపొందించిన చిత్రం ప్రదర్శనకు వచ్చిన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి వినుకొండకు చెందిన చిత్రకారులు షేక్ మస్తాన్ వలి, రవి జెస్టిస్, యశోద హాజరయ్యారు.ఈ సందర్భంగా జెస్టిస్ను పలువురు పురప్రముఖులు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, రాజకీయ నాయకులు అభినందించారు. వినుకొండ ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం ఆనందకరమని వారు అభిప్రాయపడ్డారు.







