
శావల్యాపురం మండల పరిధిలో పలువురు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. రూరల్ సీఐ బ్రహ్మయ్య పర్యవేక్షణలో ఎస్సై వెంకటేశ్ బాబు ప్రత్యేక దృష్టి సారించి CEIR వెబ్సైట్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేయించారు. ట్రేస్ అయిన మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. ఫోన్లు లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. స్థానికులు పోలీసుల పనితీరును ప్రశంసించారు.






