అక్రమ ఇసుక, మట్టి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని జీవీ ఆంజనేయులు సూచనలు
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఇసుక, మట్టి అక్రమ రవాణాను సహించబోమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన జీవీ ఆంజనేయులు, అక్రమ ఇసుక మరియు మట్టి రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రకృతి వనరులను కాపాడటంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే చర్యలను కఠినంగా అరికట్టాలని ఆయన పేర్కొన్నారు.
జీవీ ఆంజనేయులు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అక్రమ రవాణాకు పాల్పడే వారెవరికైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.







