
పల్నాడు జిల్లా వినుకొండ నగర శివారు NRT రోడ్డులో చెక్క వాగు పక్కన ఉన్న శనిదేవుడు మరియు బాణ లింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం (ఫిబ్రవరి 11, 2026) నిత్య అభిషేకం కార్యక్రమం భక్తుల సందోహంతో ఘనంగా నిర్వహించారు. మాఘ బహుళ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజూ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ ఆలయానికి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రధాన అర్చకులుగా జానపాటి పరమేశ్వర స్వామి సేవలందిస్తున్నారు.






