
శ్రీశైలం సున్నిపెంటలో నిర్వహించనున్న మెడికల్ క్యాంపుకు వెళుతున్న టెంపో వాహనం లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదం గురువారం శవల్యాపురం వద్ద చోటుచేసుకుంది.విశాఖపట్నం జిల్లా మధురవాడ నుంచి బయలుదేరిన టెంపో వాహనం ముందుకు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా నెమ్మదించడంతో వెనుక నుంచి ఢీకొన్నట్లు డ్రైవర్ జగదీష్ తెలిపాడు.

ఈ ప్రమాదంలో డ్రైవర్ జగదీష్‌కు గాయాలు కాగా, టెంపోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న రూరల్ సీఐ బ్రహ్మయ్య ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారిని వారి స్వస్థలాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఘటనపై ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






