
వినుకొండ పట్టణంలోని మిద్దబాయి కాలనీలో ఆదివారం వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు గాయపడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు కాలనీలో ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు బాలుడిపై దాడి చేయడంతో అతనికి గాయాలయ్యాయి.ఈ ఘటనను గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ఇటీవల కాలంలో పట్టణంలో వీధి కుక్కల బెడద పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులను పాఠశాలలకు పంపించే విషయంలో తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.వీధి కుక్కల సమస్యపై వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ప్రజలను రక్షించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.







