
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మన్నేపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరునాళ్లు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ లీలావతి ఆదేశాల మేరకు వేలాది మంది భక్తులకు పులిహోరతో పాటు అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.కార్యక్రమం సజావుగా జరిగేందుకు ఫౌండేషన్ మేనేజర్, సిబ్బంది, స్థానిక నాయకులు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు కూడా చేశారు. తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.








