
వినుకొండ పట్టణంలోని స్తూపం సోమవారం సమీపంలో ఈ విషాద సంఘటన జరిగింది. టాయిలెట్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై బాత్రూంలోనే మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని పెదకంచర్ల గ్రామానికి చెందిన వంటేరు పుల్లయ్య (70)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వ్యవసాయ రైతుగా జీవనం సాగిస్తూ ఉండేవారని, ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నట్లు బంధువులు తెలిపారు.కొంతసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపు తట్టి స్పందన లేకపోవడంతో తలుపు తెరిచి చూడగా వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







