
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అధికారులతో సమీక్ష నిర్వహించారు.సీఎం పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పి గ్రౌండ్లో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.అలాగే ముఖ్యమంత్రి వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలించనున్న నేపథ్యంలో వైద్యసంబంధ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా ఏరియా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన, ఆర్డీవో మధులత, మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి షకీలా, ఆర్టీసీ, పోలీస్, మున్సిపల్, మెడికల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.








