పల్నాడు జిల్లా:మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని కొన్ని BC గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి ప్రవేశ ప్రకటన విడుదలైంది.
ఈ ప్రకటన ప్రకారం 5వ తరగతి మరియు 6వ నుంచి 8వ తరగతుల వరకు ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
గురజాల సమీప దాచేపల్లి (బాలురు), వినుకొండ (బాలురు), నరసరావుపేట (బాలికలు), సత్తెనపల్లి సమీప మాదల (బాలికలు) పాఠశాలల్లో ఈ ప్రవేశాలు చేపడుతున్నారు.
అధికారుల వివరాల ప్రకారం, దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 4న ప్రారంభమై మార్చి 4 వరకు కొనసాగుతుంది.
అర్హతలు5వ తరగతి ప్రవేశానికి 2025–26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలి.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు మించకూడదు.వయస్సు పరిమితులు మరియు ఇతర అర్హతలు సంబంధిత తరగతుల ప్రకారం వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
పరీక్ష వివరాలుప్రవేశానికి రాత పరీక్ష నిర్వహిస్తారు.5వ తరగతి పరీక్ష ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.6,7,8 తరగతుల పరీక్ష ఏప్రిల్ 19న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నారు.
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు జరుగుతుంది.సీట్ల వివరాలువినుకొండ, నరసరావుపేట, గురజాల–దాచేపల్లి, సత్తెనపల్లి–మాదల పాఠశాలల్లో కలిపి పలు విభాగాల్లో ఖాళీ సీట్లు ఉన్నట్లు సమాచారం.
ఖచ్చితమైన వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.దరఖాస్తు విధానందరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు.
సంప్రదింపు నంబర్లు
సత్తెనపల్లి (మాదల) బాలికల గురుకులం: 8143400305వినుకొండ బాలుర గురుకులం: 9951691407నరసరావుపేట బాలికల గురుకులం: 9908110159గురజాల–దాచేపల్లి బాలుర గురుకులం: 8317596367అర్హతలు, తేదీలు మరియు సీట్ల వివరాలను ముందుగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.






