
ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండకు రానున్న నేపథ్యం లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పట్టణంలో పర్యటించారు.
పర్యవేక్షణలో భాగంగా జూనియర్ కాలేజీ గ్రౌండ్, ఎంఎస్పీ గ్రౌండ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ గదులు, శస్త్రచికిత్స గదులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న వసతులు, రోగులకు అందుతున్న సేవల గురించి డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అదే సమయంలో ఆసుపత్రికి అవసరమైన అదనపు సౌకర్యాల గురించి వైద్య సిబ్బంది కలెక్టర్కు వివరించారు. అవసరమైన అంశాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.







