
సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు కొన్ని నిబంధనలు విధించింది. ప్రతి రోజూ సంబంధిత సీపీఎస్ కార్యాలయంలో హాజరుకావాలని స్పష్టం చేసింది. అలాగే దేశం విడిచి వెళ్లకూడదని, తన పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది.గత ఏడాది నవంబర్ నెలలో సినిమాల పైరసీకి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో అనుమతి లేకుండా సినిమాలు విడుదల చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సినీ పరిశ్రమలో కూడా చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టిన అధికారులు, డిజిటల్ ఆధారాలను సేకరించినట్లు సమాచారం. బెయిల్ మంజూరు అయినప్పటికీ కేసు విచారణ కొనసాగుతుందని న్యాయవర్గాలు వెల్లడించాయి.







