
వినుకొండ:వినుకొండ నగర శివారులోని ఎన్ఆర్టి రోడ్డులో చెక్కవాగు సమీపంలో ఉన్న శ్రీ శనిదేవుని మరియు బాణ లింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నిత్యాభిషేక కార్యక్రమం భక్తుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఫాల్గుణ శుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.ఆలయం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనార్థం తెరిచి ఉంచుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.వినుకొండ నగర శివారులోని నరసరావుపేట రోడ్డులో ఉన్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చర స్వామి దేవస్థానానికి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రధాన అర్చకులుగా జానపాటి శివపార్వతి సమేత పరమేశ్వర స్వామి సేవలందిస్తున్నారు.భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.








