
పల్నాడు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.జిల్లాలో మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.







