పల్నాడు జిల్లా శావల్యాపురం ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో డ్రింక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వినియోగంపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా రహదారులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే అంశంపై పరీక్షలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఐ వెంకటేష్ బాబు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
👉 గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.








