
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఏపీ శాసన వ్యవస్థ ఆటవిడుపు ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ క్రీడోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. ఈ క్రీడోత్సవాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించిన ఈ క్రీడలు ఆకట్టుకున్నాయి.ప్రజాప్రతినిధులు రోజువారీ రాజకీయ బాధ్యతల నుంచి కొంత విశ్రాంతి పొందేందుకు ఇటువంటి క్రీడోత్సవాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.








