నూజెండ్ల మండలంలోని దాట్లవారిపాలెం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనల మేరకు నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, విధవలు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భద్రత కలుగుతోందన్నారు.
కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ కుంట కోటిరెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోతడక వీరాచారి, తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు గుడిపూడి ఏసురత్నం, సీనియర్ నాయకులు ఆళ్ల గురువారెడ్డి, జక్కిరెడ్డి అబ్బిరెడ్డి, బైలడుగు తులసారావు, మాదాల ఎలమంద, మద్ది రెడ్డి కేశవరెడ్డి, మద్ది రెడ్డి సుబ్బారెడ్డి, బూత్ కన్వీనర్ మక్కెళ్ళ వెంకట్రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఇంకా అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని నాయకులను కోరారు. 







