
వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలోని బాలాజీ ఎస్టేట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో దాని వెనుక వస్తున్న ఆశోక్ లైలాండ్ వాహనం ఒక్కసారిగా ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఆశోక్ లైలాండ్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.






