
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మార్చి 1 నుండి 8 వరకు ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు వెన్నపూస కాలనీ సమీపంలోని గీతాంజలి స్కూల్ వద్ద నుండి మహిళా సాధికారతపై ర్యాలీ నిర్వహించారు. మహిళల భద్రత, హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రభాకర్, ఎస్ఐలు పుల్లారావు, ఉదయలక్ష్మి, పోలీసు సిబ్బంది, గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ కిషోర్, విద్యార్థులు మరియు మహిళలు పాల్గొన్నారు. మహిళలు సమాజంలో ముందుండాలని, తమ హక్కుల కోసం చైతన్యంతో ఉండాలని అధికారులు సూచించారు.







