Kothapatnam
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఒక యువకుడు చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడిని పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కొత్తపట్నం పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ వేముల సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.
తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు







