
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన సీతారామాచార్యులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి స్పందించారు.
ఈ నేపథ్యంలో బుధవారం సీతారామాచార్యులకు రూ.7 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కును అందజేశారు. ఈ సహాయం వారి కుటుంబానికి పెద్ద ఊరటగా నిలిచింది.
ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు అవసరమైన సమయంలో స్పందించి సహాయం అందించినందుకు గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బయ్య మాట్లాడుతూ వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించేందుకు సహకరించినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు 







