
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను అందుబాటులో లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల చదువు, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సీఎం పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు అధికారులను ఆదేశించారు. 90 రోజుల్లో పూర్తి స్థాయి మార్గదర్శకాలను సిద్ధం చేసి అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే సోషల్ మీడియా సంస్థలతో కూడా చర్చలు జరిపి పిల్లలకు ఖాతాలు అందుబాటులో లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పిల్లల భద్రత, భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు సోషల్ మీడియాను వినియోగించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక ఇదే తరహాలో కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై చర్చ మొదలైం
ది.







