⌂ Village News

వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం.. వృద్ధ మహిళకు తీవ్ర గాయాలు

వినుకొండ: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు డిపోలోకి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వృద్ధ మహిళ బస్సు కింద పడటంతో ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఈపూరు మండలం ఎర్రగుంట తండాకు చెందిన రామావత్ చక్రీ బాయ్‌గా గుర్తించారు. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం వినుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

WhatsApp