
వినుకొండ పట్టణంలోని లాడ్జీలపై శుక్రవారం అర్థరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న సుమారు 13 లాడ్జీలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఒక లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక మహిళ, ఒక పురుషుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటుగా వారికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
లాడ్జీల్లో అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులపై పోలీసులు విచారణ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






