Women's Day celebrations
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని రైలుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతు నాయకురాలు లింగా శైలజ ఇంటి వద్ద మహిళలను దుశ్యాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ ప్రతి మహిళ ఆది పరాశక్తి అని, ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ థెరిస్సా లాంటి మహనీయుల స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు లింగా శైలజ, తిరువీధుల రవణమ్మ, మక్కెన మాధవి, వరగాని మాధవి, మస్తానమ్మ, మునెమ్మ, మున్ని గౌసియా, లక్ష్మి, లింగారామయ్య, మస్తాన్, చిన్న, మునయ్య, నాగేశ్వరావు, శ్రీను, చీరాల అంజయ్య, దుర్గా రెడ్డి, తోట నరసింహారావు వీరితోపాటుగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.








