
దర్శి పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలను సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలాన్ని అందిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన మహిళలతో కలిసి గొట్టిపాటి లక్ష్మి సెల్ఫీలు తీసుకుని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు







