
దర్శి గడియార స్థంభం వద్ద ఏర్పాటు చేసిన బిగ్ డిజిటల్ స్క్రీన్‌పై ఇండియా–న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆదివారం క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా వీక్షించారు. ఈ కార్యక్రమానికి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాజరై అభిమానులతో కలిసి మ్యాచ్‌ను చూశారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువత, స్థానికులు పాల్గొన్నారు. దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, దర్శి సొసైటీ అధ్యక్షుడు కలువకొలను చంద్రశేఖర్, రామాలయం చైర్మన్ మునగ శ్రీను, టౌన్ పార్టీ అధ్యక్షుడు చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టివెన్, టిడిపి నాయకులు సానే సుబ్బయ్య, శోభరాణి వీరితోపాటుగా పలువురు స్థానిక నాయకులు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. మ్యాచ్ సందర్భంగా అక్కడ సందడినెలకొంది 







