
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ ఏకోనారాయణ స్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో ఆయనతోపాటుగా నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.







