
అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్–న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ప్రారంభం నుంచే కష్టాల్లో పడింది. భారత బౌలర్ల దూకుడు ముందు కివీస్ బ్యాటర్లు నిలబడలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం 12.5 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. టిమ్ సైఫర్ట్ 52 పరుగులు చేసి అవుట్ కాగా మిచెల్ సాంట్నర్ 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెంచాడు.







