శనిదేవుని కి ప్రత్యేక పూజలు
వినుకొండ నగర శివారులోని నరసరావుపేట రోడ్డుపై చెక్కవాగు పక్కన ఉన్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చర స్వామి దేవస్థానంలో సోమవారం నిత్య అభిషేకం నిర్వహించారు. ఫాల్గుణ బహుళ షష్ఠి సందర్భంగా శ్రీ శనిదేవుని మరియు బాణలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, దివ్యాభిషేకం భక్తజన సందోహంలో ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.







